హైడ్రాపై దుష్ప్రచారం కమిషనర్ ఆగ్రహం
బాధితురాలి ఆత్మహత్యతో సంబంధం లేదు
హైదరాబాద్ – హైడ్రాపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఆయన శనివారం కీలక ప్రకటన చేశారు. లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల ప్రజల్లో , నగర వాసులలో భయాందోళనలు నెలకొంటాయని స్పష్టం చేశారు. కేవలం బఫర్ జోన్ లో ఉన్న వాటిని గుర్తించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు.
అయితే తాము కూల్చి వేతలకు సంబంధించి ముందస్తు నోటీసులు ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేశారు ఏవీ రంగనాథ్. కూకట్ పల్లి ఇన్ స్పెక్టర్ తో తాను మాట్లాడానని, ఎఫ్‌టిఎల్‌కు దూరంగా కూకట్‌పల్లి సరస్సు సమీపంలోనే ఉంటున్నారని ఆయన చెప్పారని తెలిపారు ఏవీ రంగనాథ్. సూసైడ్ ఎపిసోడ్ తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
హైడ్రా గురించి భయాందోళనలు సృష్టించడం మానేయాలని తాను మీడియాను ముఖ్యంగా సోషల్ మీడియాను అభ్యర్థిస్తున్నానని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కూల్చివేత వెనుక హైడ్రా ఉందంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కమిషనర్.
కూల్చివేత కోసం మూసీకి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. కూల్చి వేతల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు బాధ పడ కూడదని అన్నారు.