Friday, May 23, 2025
HomeNEWSప్ర‌భుత్వ భూముల క‌బ్జాల‌పై సీరియ‌స్

ప్ర‌భుత్వ భూముల క‌బ్జాల‌పై సీరియ‌స్

క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్

హైద‌రాబాద్ – మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామరంలో ప్రభుత్వ భూములను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. క్వారీ లీజులు ముగిసినా అక్కడ నుంచి ఖాళీ చేయకుండా కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన ఆయ‌న రంగంలోకి దిగారు. పక్కనే ఉన్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ల్యాండ్ కబ్జాకు గురి కావ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాదాపు 400ల వరకూ ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఏవీ రంగ‌నాథ్. దాదాపు 78 ఎకరాల వరకు లీజుకు తీసుకున్నవారితో వచ్చేవారం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు.

అనంతరం శేరిలింగంపల్లి మండలం నల్లగండ్ల చెరువు నాలా కబ్జాకు గురి అవుతుందన్న ఫిర్యాదులను పరిశీలించారు. నాల విస్తీర్ణం తగ్గకుండా చూడాలని అక్కడ పోసిన మట్టిని తొలగించాలని వెర్టెక్స్ నిర్మాణ సంస్థను ఆదేశించారు. నాలా విస్తీర్ణంతో పాటు బఫర్ జోన్ కు ఆటంకం రాకుండా నిర్మాణం చేపడతామని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. గోపన్నపల్లి గ్రామంలో మేల్లకుంట కబ్జాకు గురికావ‌డం ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు ఏవీ రంగ‌నాథ్. రాజేంద్రనగర్ మండలం పుప్పాల గూడలోని మామాసాని కుంట ను పరిశీలించారు. సర్వే నంబర్ల ప్రకారం చెరువు హద్దులపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో అధికారులతో సమీక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments