హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కామెంట్
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో చెరువుల పర్యవేక్షణ సూపర్ అంటూ కితాబు ఇచ్చారు. తన ఆధ్వర్యంలో కొంత మంది సభ్యులు కలిసి ఇటీవల కన్నడ ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. చాలా చెరువులను పరిశీలించామని, వారి నిర్వహణ, పర్యవేక్షణ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు ఏవీ రంగనాథ్.
అంతే కాదు అక్కడి ప్రభుత్వమే చెరువుల నిర్వహణ ఖర్చును భరిస్తుందని తెలిపారు హైడ్రా కమిషనర్. ఇది మరింత బాగుందన్నారు. అక్కడి చెరువుల పరిస్థితిని, వారు తీసుకుంటున్న చర్యలను పరిశీలించామని, ఇక్కడ కూడా అక్కడి నిర్వహణ , పర్యవేక్షణ పద్దతులను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు ఏవీ రంగనాథ్.
ఇదే సమయంలో ఎఫ్డీఎల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్టీఎల్ లో ఉండి..అనుమతి గనుక తీసుకుని ఉంటే ఆ ఇళ్లను ముట్టుకోమని, వాటి జోలికి వెళ్లబోమని, కూల్చే ప్రసక్తి లేదంటూ పేర్కొన్నారు. ఇక నుంచి ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించారు.