NEWSTELANGANA

బెంగ‌ళూరులో హైడ్రా టీం బిజీ

Share it with your family & friends

ప‌రిశీలించిన ఏవీ రంగ‌నాథ్

బెంగ‌ళూరు – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆధ్వ‌ర్యంలోని అధికారుల బృందం బిజీగా మారింది. ప్ర‌స్తుతం భ‌వ‌నాల‌ను ఎలా కూల్చాల‌నే దానిపై అధ్య‌యనం చేసేందుకు వెళ్లారు. దానికి ఉన్న అడ్డంకులు ఏమిటి అనే దానిపై కూడా ప‌రిశీలించారు. అక్క‌డ స‌ర‌స్సుల‌ను ఎలా ప‌రిర‌క్షిస్తున్నారు, ఎలా ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుతున్నార‌నే దానిపై ఆరా తీశారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్.

సరస్సుల సంరక్షణ, పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై అధ్యయనం చేసేందుకు బెంగళూరులోని కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రాన్ని సందర్శించారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ టీం.

వరద ఛానళ్లను పర్యవేక్షించడానికి సెన్సార్ సిస్టమ్‌లతో పాటు వర్ష సూచనలు, వరద హెచ్చరికలు , ట్రాఫిక్ సలహాల కోసం మేఘ సందేశం యాప్‌ను సమీక్షించారు.

20 సంవత్సరాల డేటాను ఉపయోగించి వరదలకు గురయ్యే ప్రాంతాలను అంచనా వేసే పద్ధతులను పరిశీలించారు. వర్షపాతం, గాలి వేగం, ఉష్ణోగ్రతను నమోదు చేసే వాతావరణ కేంద్రాలను అంచనా వేశారు. ఈ బృందంలో ప్రాంతీయ అగ్నిమాపక అధికారులు వి.పాపయ్య, ఎ.జయప్రకాష్, ఎఇ నాగరాజు, ఇన్‌స్పెక్టర్ విజయ్ ఆదిత్య ఉన్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో హైడ్రా బెంబేలు పెట్టేస్తోంది. దీని దెబ్బ‌కు రియ‌ల్ట‌ర్లతో పాటు న‌గ‌ర వాసులు ఆందోళ‌న‌లో ప‌డుతున్నారు.