ఆక్రమణలపై కమిషనర్ గుస్సా
చర్యలు తీసుకోవాలని ఆదేశం
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ అయ్యారు. మంగళవారం నగరంలోని కముని చెరువు, మైసమ్మ చెరువులను సందర్శించారు. కొత్తగా ఆక్రమణలు చేపట్టడాన్ని పరిశీలించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెరువులను పరిరక్షించాలని, ఆక్రమణలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. 2024 జూలై తర్వాత నిర్మించిన నిర్మాణాలను మాత్రమే కూల్చి వేస్తామని కమిషనర్ ఉద్ఘాటించారు. అవి చట్ట బద్ధమైనా లేదా చట్ట విరుద్ధమైనా అనే దానిపై విచారణ జరుపుతామని చెప్పారు.
ఈ కాలానికి కంటే ముందు ఉన్న నిర్మాణాలు ముట్టుకోమని, అయితే పాత నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని స్థానిక రాఘవేంద్ర కాలనీ వాసులకు హామీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.
ఈ సందర్భంగా కమీషనర్ రంగనాథ్ ఇటీవల ఆక్రమణలను తొలగించి చెరువు కట్టల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాసవీ సరోవర్ డెవలపర్‌లు తప్పనిసరిగా 17 మీటర్ల వెడల్పుతో నాలాను నిర్మిస్తే తప్ప నిర్మాణాన్ని కొనసాగించవద్దని ఆయన ఆదేశించారు.
నాలా కముని చెరువు, మైసమ్మ చెరువు మధ్య కీలకమైన లింక్‌గా పనిచేస్తుంది, సరస్సుల మధ్య సరైన నీటి ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.
చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోందన్నారు కమిషనర్.