అఫీజ్‌పేట, రాయదుర్గంలో వందల కోట్ల భూమికి విముక్తి
హైదరాబాద్ – హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించింది. వివిధ కోర్టులలో కేసులున్నప్పటికీ చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు తెర లేపాయి బడా నిర్మాణ సంస్థలు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ, కొండపూర్లోని ఆఫీజపేట సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలు ఉండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి.సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డులలో నమోదై ఉంది. ఆ సర్వే నంబరు 79/1 గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది హోమ్స్ సంస్థ. వీటిని తొలగించారు.
ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసి.. ఇంకా ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీసు కార్యాలయంతో పాటు.. పలు షెడ్డులు ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చినట్టు గుర్తించింది హైడ్రా . ఈ భూములపై సుప్రీం కోర్టులో చాలా కాలంగా సి.ఎస్.14/58 అనే వాజ్యం పెండింగులో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ భూమిపై కోర్టులో కేసులుండగా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించు కాకుండా నిర్మాణాలు చేపట్టారు.
ఫైనల్ డక్రీ రాకుండానే ఈ భూములలో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని పై వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా విస్మయం వ్యక్త పరిచిన సుప్రీం కోర్టు. ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాల తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా. తాము రోజూ ఆడుకునే చోట ఆడ నివ్వడంలేదని.. అక్కడ చెరువును కూడా మాయం చేస్తున్నారని.. రహదారులు నిర్మిస్తున్నారని యువత ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది.
షేక్పేట మండలం రాయదుర్గం దర్గా దగ్గరలోని సర్వే నెంబర్ 5/2లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా. 39 ఎకరాలవరకు ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు నిర్ధారణ.ల్యాండ్ గ్రాబింగ్ కేసున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేసిన నార్నే ఎస్టేట్స్ సంస్థ. అనుమతిలేని లే ఔట్‌తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపట్టిన ఆక్రమణదారులు. అక్కడ చెరువును కూడా కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మకాలు చేస్తున్న నార్నే ఎస్టేట్స్ సంస్థ. అఫీజ్‌పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డు లు పెట్టిన హైడ్రా. ఆక్రమణ దారులపై పోలీసు కేసు నమోదు చేయించిన హైడ్రా.