నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టాం
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అక్రమంగా ఫాం హౌస్ నిర్మాణం చేపట్టడం జరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు. మంగళవారం పట్నం మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడ లేదని స్పష్టం చేశారు. కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అంటూ పేర్కొన్నారు. పూర్తిగా కొట్టి పారేశారు.
బాజాప్తాగా తనది పట్టా భూమి అని చెప్పారు. నిబంధనల ప్రకారమే అందులో నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ఒకవేళ తాను కొత్తాల్ గూడ లో కట్టిన భవనం అక్రమం అని అధికారుల విచారణలో తేలితే తాను దగ్గరుండి కూల్చి వేస్తానని ప్రకటించారు పట్నం మహేందర్ రెడ్డి.
కలెక్టర్ తో మాట్లాడిన తర్వాతే, అనుమతి పొందిన తర్వాతే తాను భవన నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు ఎమ్మెల్సీ. కొందరు కావాలని తనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి వాటికి తాను భయపడనని, తాను సక్రమంగానే , అన్ని పర్మిషన్స్ ఉండడం వల్లనే భవనం కట్టానని అన్నారు .