హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ
ఎట్టకేలకు తలవంచిన ఐసీసీ
దుబాయ్ – ఐసీసీ కీలక ప్రకటన చేసింది. యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠకు తెరతీసిన 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా లేదా అన్న దానికి పుల్ స్టాప్ పెట్టింది. శుక్రవారం పాకిస్తాన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) , భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ల మధ్య వార్ కొనసాగింది. భద్రతా కారణాల రీత్యా మోడీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో భారత క్రికెట్ జట్టును పంపించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతి ఇవ్వనంటూ తేల్చి చెప్పడంతో ఈ విషయంపై తీవ్ర రాద్దాంతం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తాము టీమిండియాకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పినా బీసీసీఐ కార్యదర్శి , ఐసీసీ చైర్మన్ జే షా ఒప్పుకోలేదు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ దిగి వచ్చింది. ఎట్టకేలకు దిగి వచ్చింది. హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఒప్పుకుంది. చివరకు ఐసీసీ ఒప్పుకుంది. దీంతోట్రోఫీని పాకిస్తాన్ , దుబాయ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇండియా-పాకిస్తాన్ లీగ్ గేమ్ కొలంబోకు మార్చబడింది, పాకిస్తాన్ భారతదేశానికి వెళ్లదు. పీసీబీకి ఆర్థిక పరిహారం లేదు. కానీ వారు 2027 తర్వాత ఐసీసీ మహిళల టోర్నీ కోసం హోస్టింగ్ హక్కులను పొందారు.