ఇచిమారు సిఇఓ దుద్దిళ్లతో భేటీ
భారీగా పెట్టుబడులు పెడతాం
హైదరాబాద్ – ప్రముఖ జపాన్ దేశానికి చెందిన ఇచిమారు ఫార్కో కంపెనీ లిమిటెడ్ సిఇవో యోషిహికో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు మంత్రి.
ఈ సందర్బంగా తమ కంపెనీకి చెందిన యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు స్పష్టం చేశారు సీఈవో. ఇందుకు సంబంధించి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సీఈవోను అభినందించారు.
ఇదిలా ఉండగా ఇచిమారు ఫార్కోస్ కంపెనీ లిమిటెడ్ వరల్డ్ వైడ్ గా కాస్మోటిక్స్ , న్యూట్రాస్యూటికల్స్ ఉత్పత్తి చేస్తోంది. అత్యంత నైపుణ్యం కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది. ఈ కీలక సమావేశంలో సీఈవో యోషిహికో ఆండో , మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అరుణ సిరి ఇద్దమల్ గదోడ, మిల్లోనా కాస్మోటిక్స్ సిఇఓ సకర్మోటో మసాయా మంత్రి దుద్దిళ్లతో భేటీ అయిన వారిలో ఉన్నారు.
వీరితో పాటు స్థానిక భాగస్వామ్యులుగా ఉన్న బండారు అమరేందర్ రెడ్డి, శ్రీరామ్ గంగాధర్ కూడా ఉన్నారు.