Friday, April 4, 2025
HomeBUSINESSఏఐపై స‌హ‌కారం అందిస్తాం - ఐబీఎం

ఏఐపై స‌హ‌కారం అందిస్తాం – ఐబీఎం

సీఎంతో వైస్ ప్రెసిడెంట్ హామీ

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని దిగ్గ‌జ ఐటీ సంస్థ ఐబీఎం స్ప‌ష్టం చేసింది. హైద‌రాబాద్ లో ఏఐపై అంత‌ర్జాతీయ స‌ద‌స్సు కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా మ‌ర్యాద పూర్వ‌కంగా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఐబీఎం వైఎస్ ప్రెసిడెంట్ డానియెలా కాంబ్.

హైదరాబాద్ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్ ఏఐ సదస్సు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ ఆసక్తి కనబరిచారు.

ఈ సమావేశంలో మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments