Saturday, May 24, 2025
HomeNEWSANDHRA PRADESHనా చుట్టూ తిరిగితే పదవులు రావు

నా చుట్టూ తిరిగితే పదవులు రావు

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు
అమ‌రావ‌తి – సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న చుట్టూ తిరిగితే ప‌ద‌వులు రావ‌ని స్పష్టం చేశారు. పార్టీపై విశ్వాసంతో కోటి మంది పార్టీ సభ్యులు అయ్యారని అన్నారు. మిమ్మల్ని ఎదురుగా చూస్తూ మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంటుందన్నారు. బీసీలు, మాదిగలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి పైకి తీసుకొచ్చింది టీడీపీనేన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొహమాటం లేకుండా చెప్తున్నా…క్షేత్ర స్థాయిలో పనిచేసి ఫలితాలు సాధించే వారిని నేరుగా గుర్తు పెట్టుకుంటాన‌ని చెప్పారు. త్వరలో వాట్సాప్ విధానం తీసుకొస్తాం…అందులో ఎమ్మెల్యే, ఎంపీ కాకుండా నేరుగా పార్టీకి పనిచేసిన వారు కూడా మీ ప్రొఫైల్ గురించి చెప్పుకోవచ్చన్నారు.

నిర్ణయం మాత్రం పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నాదే ఉంటుందన్నారు. నాయకులు మీ కుటుంబం, బంధువులను చూసుకుంటే నిజమైన కార్యకర్తలను ఎవరు చూసుకుంటారని ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు నాయుడు. ఆస్తులు పోయినా, ప్రాణాలు పోయినా కార్యకర్తలు పార్టీ జెండాను విదల్లేదన్నారు.
నాయకులు పార్టీ మారినా కార్యకర్తలు ఉక్కు సంకల్పంతో పార్టీతో ఉన్నారని ప్ర‌శ్నించారు సీఎం. పార్టీ శ్రేణులను వైసీపీ ప్రభుత్వం వేధించిందన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడిన కార్యకర్తలకు కాకుండా వైసీపీ నేతలకు పనులు చేయాలా అని నిల‌దీశారు. సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తాం…పనులు, గౌరవం మాత్రం మా కార్యకర్తలకే ఇస్తామ‌న్నారు. డబ్బులకు లొంగో, కులపిచ్చితోనే అవతలివారికి పనిచేస్తే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments