అబుదాబిలో తళుక్కుమన్న తారలు
పాల్గొన్న నటుడు విక్టరీ వెంకటేశ్
అబుదాబి – ప్రతిష్టాత్మకమైన ఐఐఎఫ్ఏ -2024 అవార్డుల ప్రధానోత్సవంతో అబుదాబి తారల రాకతో కళకళ లాడుతోంది. ప్రధానంగా భారత దేశానికి చెందిన సినీ రంగ ప్రముఖులు క్యూ కట్టారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, విక్రమ్ , దిగ్గజ సినీ సంగీత దర్శకుడు అల్లా రఖా రెహమాన్ తో పాటు తన అందంతో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ , మృణాల్ ఠాకూర్ ప్రధాన ఆకర్షణగా మారారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
వీరితో పాటు టాప్ హీరోస్ , హీరోయిన్లు సైతం అబుదాబిలో ప్రత్యక్షం కావడం విశేషం. వీరిలో షారూఖ్ ఖాన్, రేఖ, విక్సీ కౌశల్, కృతీ సనన్ , షాహిద్ కపూర్ రిహార్సల్స్ లలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అబుదాబి లోని యాస్ ఐలాండ్ లో మూడు రోజుల పాటు కోలాహలం నెలకొననుంది. బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్ కు చెందిన తారలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. కరణ్ జోహార్ 24వ ఎడిషన్ అవార్డులను హోస్ట్ చేయడం విశేషం.
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా హాజరు కావడంతో అందరి కళ్లు ఆమెపై పడ్డాయి.
ఇదే సమయంలో రేఖ 22 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆమె డెనిమ్ లుక్ లో కనిపించవింది. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అవార్డును అందుకోనున్నారు. బాలకృష్ణ, ప్రభుదేవా కూడా హాజరయ్యారు. వీరితో పాటు మరో దిగ్గజ నటుడు బ్రహ్మానందం కూడా చేరుకున్నారు.
వీరితో పాటు బాబీ డియోల్, అనిల్ కపూరర్ , అనన్య పాండే, జాన్వీ కపూర్ , రాశి కన్నా, ప్రభుదేవా, డీఎస్పీ కూడా పాల్గొనడం విశేషం.