అవరావతి భవనాలన్నీ బలంగానే ఉన్నాయి
నివేదిక వెల్లడించిన ఐఐటీ నిపుణుల కమిటీ
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి నగరం పూర్తిగా సేఫ్ జోన్ లో ఉందని ఐఐటీ నిపుణుల కమిటీ తేల్చింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర పురపాలిక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తేల్చి చెప్పారు.
గతంలో నిర్మించిన భవనాలన్నీ బలంగానే ఉన్నాయని ఐఐటి నిపుణులు నివేదిక వెల్లడించడం విశేషం. ఇదిలా ఉండగా రాజధాని లో 2014 – 2019 మధ్య నిర్మించిన భవనాలు మధ్యలోనే నిర్మాణాలు నిలిచి పోయాయి.
గత వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోక పోవడం తో ఆయా భవనాలు సామర్థ్యం ఎలా ఉందనే దాని పై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని కోసం ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నైలకు భవనాల పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది..ఈ నివేదిక ప్రభుత్వానికి అందింది..
ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్లు, హై కోర్టు తో పాటు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మాణం చేసిన 3600 ఫ్లాట్ లకు ఎలాంటి ఇబ్బందీ లేదని…వాటి నిర్మాణం కొనసాగించు కోవచ్చని నివేదికలు అందాయి.
ఆయా నిర్మాణాల పనులకు రాబోయే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ. .ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందన్నారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు వర్షాల వల్ల ఇబ్బంది కలిగిందని..త్వరలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.