NEWSANDHRA PRADESH

ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్

Share it with your family & friends

హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని హెచ్చ‌రించింది ఏపీ వాతావ‌ర‌ణ శాఖ‌. మ‌రోసారి వ‌ర్షాలు ముంచెత్త‌నున్నాయ‌ని అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అక్టోబ‌ర్ 10 త‌ర్వాత ఊహించ‌ని రీతిలో వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని పేర్కొంది. మూడు తుఫాన్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.

అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు. ఇందులో భాగంగా ఏపీలోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. మ‌రో వైపు ఆదివారం ప‌లు జిల్లాల్లో భారీగా వ‌ర్షాలు కురిశాయి.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది.

ఈ తుపాన్ల ప్రభావంతో ఈ నెల 10 తర్వాత భారీ ఎత్తున కురిసే అవ‌కావం ఉంద‌ని అందుకే జాగ్ర‌త్తంగా ఉండాల‌ని కోరింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే భారీ వ‌ర్షాల దెబ్బ‌కు ఏపీ అత‌లాకుత‌లం అయ్యింది. ఎక్క‌డ చూసినా నీళ్లే . అన్ని ప్రాజెక్టులు నిండి పోయాయి. నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి.