తెలంగాణలో చలి తీవ్రత గుండె దడ
పలు జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల లోపు
హైదరాబాద్ – వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
అంతే కాకుండా హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని సూచించింది. వీలైతే చలి కాచుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించింది. అంతే కాకుండా హీటర్లను ఏర్పాటు చేసుకుంటే మేలు కలుగుతుందని పేర్కొంది. ప్రధానంగా వయసు మళ్లిన వారు, వృద్దులు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.