కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా సూపర్ షో
ఆస్ట్రేలియా నడ్డి విరిచిన స్పీడ్ స్టర్
ఆస్ట్రేలియా – భారత కెప్టెన్ స్పీడ్ స్టర్ గా పేరు పొందిన జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ దెబ్బకు ఆసిస్ ఆటగాళ్లు విల విల లాడారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు అతి తక్కువ స్కోర్ చేశారు. ప్రస్తుతం ఐదు టెస్టుల సీరీస్ కొనసాగుతోంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ గైర్హాజరీతో బుమ్రా ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతానికి పై చేయి కొనసాగుతోంది. బుమ్రా మ్యాజిక్ చేశాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఆసిస్ టాపార్డర్ ను దెబ్బ తీశాడు. బుమ్రా బౌలింగ్ అద్బుతం అంటూ ప్రశంసలు కురిపించారు మాజీ క్రికెటర్లు.
ఒకానొక దశలో ఇబ్బందుల్లో ఉన్న భారత జట్టును ఆదుకున్నారు తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. తను కేవలం 59 బంతులు ఆడి 6 ఫోర్లు ఒక భారీ సిక్సర్ తో 41 రన్స్ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రిషబ్ పంత్ 37 రన్స్ చేశాడు.
అనంతరం బరిలోకి దిగి భారత్ ను ఒత్తిడి పెంచాలని బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ ఇచ్చాడు స్పీడ్ స్టర్ బుమ్రా.