వివాదాస్పద నిర్ణయం అంపైర్ పై ఆగ్రహం
బంతి తాకక పోయినా కేఎల్ రాహుల్ అవుట్
ఆస్ట్రేలియా – డీఆర్ఎస్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలో ఆసిస్ తో జరుగుతున్న 5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా తొలి టెస్టు ఇవాళ ప్రారంభమైంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఆసిస్ బౌలర్ల ధాటికి టీమిండియా నాలుగు వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. కడపటి సమాచారం అందే వరకు 4 వికెట్లు చేజార్చుకుంది.
ప్రధానంగా భారతీయ క్రికెటర్ కేఎల్ రాహుల్ అవుట్ కావడం మరింత వివాదాన్ని రేపేలా చేసింది. బంతి తాకక పోయినా మూడో అంపైర్ అవుట్ ఇవ్వడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఎలా డెసిషన్ తీసుకుంటారంటూ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
బంతి బ్యాట్ కు తాకలేదని, ఇది ప్రివ్యూలో స్పష్టంగా కనిపిస్తోందని, అయినా డీఆర్ఎస్ అంపైర్ అవుట్ అయినట్లు ప్రకటించడం ఏమీ బాగోలేదంటూ భగ్గుమంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇక ఎక్స్ లో టాప్ లో సెన్సేషన్ గా మారింది కేఎల్ రాహుల్ అవుట్ వ్యవహారం. ప్రస్తుతం టీమిండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎందుకంటే స్వదేశంలో మన జట్టు న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ ను ఘోరంగా కోల్పోయింది 3-0 తేడాతో ఓటమి పాలైంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ సాధించాలంటే భారత జట్టు ఆసిస్ తో జరిగే 5 టెస్టు మ్యాచ్ లను పూర్తిగా గెలవాల్సి ఉంటుంది.