ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం
239 పరుగుల తేడాతో బిగ్ షాక్
ఆస్ట్రేలియా – ఆస్ట్రేలియాలోని పెర్త్ లో జరిగిన తొలి టెస్ట్ లో ఊహించని రీతిలో భారత జట్టు బిగ్ షాక్ ఇచ్చింది ఆతిథ్య ఆసిస్ జట్టుకు. 239 పరుగుల తేడాతో తొలి టెస్టులో గెలుపొందింది. స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సీరీస్ లో కీవీస్ తో ఘోరంగా ఓటమి పాలైంది. కానీ ఆ అపజయాన్ని మరిపిస్తూ విదేశీ గడ్డపై గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం విశేషం. రోహిత్ శర్మ లేకుండానే బుమ్రా నేతృత్వంలో భారత జట్టు అద్భుత సక్సెస్ ను అందుకుంది.
ఇటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోనూ దుమ్ము రేపింది టీమిండియా. తొలుత 150 రన్స్ కే పరిమితమైనా ఆసిస్ ను తొలి ఇన్నింగ్స్ లో కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించింది. టార్గెట్ ఛేదించలేక ఆసిస్ చేతులెత్తేసింది.
5 టెస్టుల సీరీస్ లో భారత జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది ఈ గెలుపుతో. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తరపున యశస్వి జైస్వాల్ , విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీలు సాధించారు. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్లు తీశారు.
వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేసి స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. అతనితో పాటు మిచెల్ మార్ష్ 47 పరుగులు చేయగా, అలెక్స్ కారీ 36 పరుగులు చేశాడు.