SPORTS

స‌త్తా చాటిన‌ జ‌స్ప్రీత్ బుమ్రా

Share it with your family & friends

కీల‌కంగా మారిన ఇండియ‌న్ పేస‌ర్

ఆస్ట్రేలియా – బ్రిస్బేన్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 405 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఆసిస్ బ్యాట‌ర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ దుమ్ము రేపారు. ఇద్ద‌రూ అద్భుత‌మైన సెంచ‌రీలు సాధించారు. భార‌త స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా అద్భుత‌మైన బౌలింగ్ చేశాడు. 5 కీల‌క‌మైన వికెట్లు తీశాడు.

స్మిత్ 101 ర‌న్స్ చేస్తే , హెడ్ 152 ప‌రుగులు చేశాడు. ఆట ముగిసే స‌మ‌యానికి స్టార్క్ 7 ప‌రుగులతో, అలెక్స్ కారీ 45 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఏడు వికెట్ల‌లో 5 వికెట్లను జ‌స్ ప్రీత్ బుమ్రా బోల్తా కొట్టించాడు.

ప్ర‌స్తుతం 5 టెస్టుల సీరీస్ కొన‌సాగుతోంది. ఇక ఆట విష‌యానికి వ‌స్తే తొలి సెష‌న్ లో ఉస్మాన్ ఖ‌వాజా 21 , నాథ‌న్ 9 ల‌ను వెంట వెంట‌నే పంపించాడు బుమ్రా. లబూషేన్ ను నితీశ్ రెడ్డి అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత బ‌రిలోకి వ‌చ్చిన స్మిత్, హెడ్ లు ఎక్క‌డా వికెట్లు కోల్పోకుండా ర‌న్స్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు క‌దిలించారు.

కెప్టెన్ చేసిన ప్ర‌యోగం ఫ‌లించ లేదు. చివ‌ర‌కు బిగ్ స్కోర్ దిశ‌గా ప‌రుగులు తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *