పట్టు బిగించిన ఆస్ట్రేలియా
దంచి కొట్టిన స్మిత్..ట్రావిస్ హెడ్
ఆస్ట్రేలియా – భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా దూసుకు పోతోంది. 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆసిస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ , ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడారు. స్మిత్ 101 రన్స్ చేస్తే , హెడ్ 152 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి స్టార్క్ 7 పరుగులతో, అలెక్స్ కారీ 45 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఏడు వికెట్లలో 5 వికెట్లను జస్ ప్రీత్ బుమ్రా బోల్తా కొట్టించాడు.
ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే భారీ స్కోర్ చేయడంతో మూడో రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది. తొలి టెస్టులో స్టాండింగ్ కెప్టెన్ బుమ్రా ఆధ్వర్యంలో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ 2వ టెస్టులో ఘోరంగా ఓటమి పాలైంది.
ప్రస్తుతం 5 టెస్టుల సీరీస్ కొనసాగుతోంది. ఇక ఆట విషయానికి వస్తే తొలి సెషన్ లో ఉస్మాన్ ఖవాజా 21 , నాథన్ 9 లను వెంట వెంటనే పంపించాడు బుమ్రా. లబూషేన్ ను నితీశ్ రెడ్డి అవుట్ చేశాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన స్మిత్, హెడ్ లు ఎక్కడా వికెట్లు కోల్పోకుండా రన్స్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు.
కెప్టెన్ చేసిన ప్రయోగం ఫలించ లేదు. చివరకు బిగ్ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది.