155 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా
ఆస్ట్రేలియా – మెల్ బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. 340 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన టీమిండియా కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఐదు టెస్టుల మ్యాచ్ ల సీరీస్ లో ఇప్పటికే భారత్ ఒక మ్యాచ్ గెలుపొందగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 2 మ్యాచ్ లలో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆసిస్ సత్తా చాటింది.
టీమిడియాలో యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఒక్కడే రాణించాడు. తనకు తోడుగా రిషబ్ పంత్ నిలిచాడు. కానీ చేసిన ప్రయత్నం ఫలించ లేదు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్ దారి పట్టారు. యశస్వి 84 రన్స్ చేస్తే రిషబ్ 30 పరుగులు చేశారు. మిగతా వారంతా ఆశించిన మేర రాణించ లేదు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ మూడు వికెట్లు, బోలాండ్ 3 వికెట్లు, నాథన్ లియాన్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్ , ట్రావిస్ హెడ్ చెరో వికెట్ కూల్చారు. దీంతో భారత జట్టు పరాజయం పరిసమాప్తం అయ్యింది.