ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీలక ప్రకటన చేసింది. భారత క్రికెట్ జట్లు 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్ ల సీరీస్ లు ఆడనుందని వెల్లడించింది. షెడ్యూల్ ను ఖరారు చేసిన ఏసీబీ ఆయా మ్యాచ్ లకు సంబంధించి వేదికలను తెలిపింది. వన్డే సీరీస్ లో భాగంగా అక్టోబర్ 19న పెర్త్ స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. 23న రెండో వన్డే అడిలైడ్ ఓవెల్ లో , 25న ఎస్సీజీ మైదానంలో మూడో వన్డే జరగనుందని తెలిపింది. ఇక టి20 సీరీస్ లో భాగంగా అక్టోబర్ 29న ప్రారంభం అవుతుంది.
తొలి టి20 మ్యాచ్ కాన్ బెర్రా మనుకా ఓవెల్ లో , 2వ టి20 మ్యాచ్ అక్టోబర్ 31న మెల్ బోర్న్ లోని ఎంసీజీ మైదానంలో , నవంబర్ 2న హోబర్డ్ లోని బెల్లెరివి ఓవల్ లో మూడో టి20 మ్యాచ్ లో , 6న 4వ టి20 మ్యాచ్ గోల్డ్ కోస్ట్ స్టేడియంలో , 5వ 20 మ్యాచ్ నవంబర్ 8న బ్రిస్బేన్ లోని ది గబ్బా స్టేడియంలో జరగనుందని ఏసీబీ తెలిపింది. ఇదిలా ఉండగా భారత క్రికెట్ జట్టు ఇప్పుడు విశ్వ విజేతలుగా నిలిచారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంది. అంతకు ముందు టి20 టోర్నీ కైవసం చేసుకుంది.