తొలి టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలుపు
కోల్ కతా – కోల్ కతా వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసింది.
ఇటీవల పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడిన అభిషేక్ శర్మ రెచ్చి పోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 34 బంతుల్లో 8 సిక్సర్లు 5 ఫోర్లతో 79 రన్స్ చేయగా శాంసన్ 26 రన్స్ చేశాడు. కేవలం 12.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేశారు.
ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. శాంసన్ అవుట్ అయ్యాక మైదానంలోకి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వికెట్ పోకుండా పని పూర్తి చేశాడు. ఇప్పటికే భారత్ ఫుల్ జోష్ లో ఉంది. అభిషేక్ శర్మ, శాంసన్ లు ఇద్దరూ ఫుల్ ఫామ్ లో ఉండడంతో ఫ్యాన్స్ తెగ సంతోషానికి లోనవుతున్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.