రంజుగా మారిన రెండో టెస్టు
ఇంగ్లండ్ టార్గెట్ 322 రన్స్
విశాఖపట్టణం – వైజాగ్ వేదికగా భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మరింత ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే 5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఆతిథ్య భారత జట్టు.
దీంతో రెండో టెస్టులో టాప్ ఆర్డర్ ఆశించిన మేర రాణించ లేక పోయినా యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్ , శుభ్ మన్ గిల్ దుమ్ము రేపారు. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారు. పానీ పూరీ కుర్రాడిగా పేరొందిన జైశ్వాల్ తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో ఆదుకున్నాడు. అంతే కాదు రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ హీరో అయితే రెండో ఇన్నింగ్స్ లో గిల్ సూపర్ సెంచరీతో మెస్మరైజ్ చేశాడు. ఇవాళ నాలుగో రోజు. దీంతో టీమిండియా ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ప్రస్తుతం 67 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ గెలవాలంటే ఇంకా 322 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 9 వికెట్లు ఉన్నాయి.
భారత బౌలర్లు రాణిస్తారా లేక ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగుతారా అన్నది వేచి చూడాలి.