SPORTS

స‌త్తా చాటిన శుభ్ మ‌న్ గిల్

Share it with your family & friends

గెలుపు దిశ‌గా భార‌త జ‌ట్టు

విశాఖ‌ప‌ట్నం – విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లు చూపిస్తూ అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు శుభ్ మ‌న్ గిల్. 136 బంతులు ఎదుర్కొన్న ఈ యువ కెర‌టం 101 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు 2 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా శుభ్ మ‌న్ గిల్ కు త‌న టెస్టు క్రికెట్ లో ఇది మూడో శ‌త‌కం కావ‌డం విశేషం. అయితే గ‌తంలో ఆడిన 13 ఇన్నింగ్స్ ల‌లో ఆశించినంత మేర రాణించ లేక పోయాడు. ఇక ఐదు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భార‌త జ‌ట్టు తొలి టెస్టు మ్యాచ్ లో ఓట‌మి పాలైంది. హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ లో జ‌రిగిన కీల‌క పోరులో 28 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం మూట గ‌ట్టుకుంది.

టాపార్డ‌ర్ విఫలం చెందారు. తాజాగా సెంచ‌రీతో గిల్ క‌దం తొక్కాడు. మ‌రో వైపు శుభ్ మ‌న్ కు తోడుగా ఆల్ రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ 33 ర‌న్స్ చేసి తోడ్పాటు అందించాడు. ఇక లంచ్ స‌మ‌యం పూర్త‌య్యే స‌రికి భార‌త్ జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. ఇంకా మ్యాచ్ కు స‌మ‌యం ఉంది. ఈ మ్యాచ్ కూడా ఫ‌లితం రానుంది.