SPORTS

య‌శ‌స్వి జైశ్వాల్ డుబ‌ల్ సెంచ‌రీ

Share it with your family & friends

చుక్క‌లు చూపించిన యువ క్రికెట‌ర్

మధుర‌వాడ – ఏపీలోని మ‌ధురావ‌డలో భార‌త్ , ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టులో యువ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ దంచి కొట్టాడ‌రు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఏకంగా డ‌బుల్ సెంచ‌రీలో విశ్వ రూపం ప్ర‌ద‌ర్శించాడు.

179 ప‌రుగుల వ‌ద్ద ఓవ‌ర్ నైట్ స్కోర్ తో రెండో రోజు మైదానంలోకి దిగిన య‌శ‌స్వి జైశ్వాల్ 21 బంతులు ఎదుర్కొని 21 ర‌న్స్ చేశాడు. త‌న టెస్టు కెరీర్ లో మ‌రిచి పోలేని రీతిలో డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్లు ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా చివ‌రి దాకా ఒత్తిడి తీసుకు రాలేక పోయారు.

ఎన్ని ర‌కాలుగా బంతులు వేసినా త‌ట్టుకుని ప‌రుగుల వ‌ర‌ద పారించాడు య‌శ‌స్వి జైశ్వాల్. కేవ‌లం 10 ఇన్నింగ్స్ ల‌లోనే డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డం ఓ రికార్డు. య‌శ‌స్వి కంటే ముందు న‌లుగురు క్రికెట‌ర్లు మాత్ర‌మే ఈ ఫీట్ సాధించారు. ఇక చిన్న వ‌య‌సు లోనే డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌డం విశేషం.

ఓ వైపు టాప్ ఆర్డ‌ర్ ఒక్క‌రొక్క‌రూ పెవిలియ‌న్ బాట ప‌డితే య‌శ‌స్వి జైశ్వాల్ మాత్రం ఒక్క‌డే ఒంట‌రి పోరాంట చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.