SPORTS

ఇంగ్లండ్ కు షాక్ ఇండియా విక్ట‌రీ

Share it with your family & friends

ఐదో టెస్టులో 64 ర‌న్స్ తేడాతో గెలుపు

ధ‌ర్మ‌శాల – రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ కు షాక్ ఇచ్చింది. శ‌నివారం అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. దేశంలో జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఆఖ‌రి టెస్టు ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 477 ర‌న్స్ కు ఆలౌట్ అయ్యింది. భారీ స్కోర్ ను ఛేదించ లేక చ‌తికిల ప‌డింది ఇంగ్లండ్ జ‌ట్టు. తొలి ఇన్నింగ్స్ లో ఆ టీమ్ కేవ‌లం 218 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఫాలో ఆన్ ఆడింది. చివ‌ర‌కు భారీ టార్గెట్ ఛేదించ బోయి ఉన్న‌ట్టుండి భార‌త బౌల‌ర్ల ధాటికి బోల్తా ప‌డింది. 195 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది.

దీంతో భార‌త జ‌ట్టు ఇన్నింగ్స్ 64 ర‌న్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. 4-1 తేడాతో భార‌త జ‌ట్టు టెస్టు సీరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఇంగ్లండ్ జ‌ట్టు కేవ‌లం హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచ్ లో మాత్ర‌మే గెలుపొందింది. ఆ త‌ర్వాత జ‌రిగిన వ‌రుస టెస్టు ల‌లో భార‌త్ జ‌ట్టు జ‌య కేత‌నం ఎగుర వేసింది. మొత్తంగా టీమిండియా ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటింది. ప్ర‌ధానంగా యంగ్ బ్యాట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ దుమ్ము రేపాడు.