చెలరేగిన అభిషేక్ శర్మ
ముంబై – ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన 5వ టి20 మ్యాచ్ లో భారత్ రికార్డ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ కుర్రాడు అభిషేక్ శర్మ దుమ్ము రేపాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. 54 బంతుల్లో 135 రన్స్ చేశాడు. 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. శివమ్ దూబే 30, తిలక్ వర్మ 24 రన్స్ చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి భారత్ 247 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బౌల్లు కార్ప్ 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే మార్క్ వుడ్ 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఏ మాత్రం లక్ష్య ఛేదనలో చతికిలపడింది. 97 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత క్రికెట్ జట్టు 150 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి కుప్ప కూలారు. రన్స్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు.
ఇంగ్లండ్ జట్టులో సాల్ట్ తప్పా ఎవరూ రాణించ లేక పోయారు. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 55 రన్స్ తో జట్టును గట్టెక్కించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేవలం 10.3 ఓవర్లలోనే పెవిలియన్ బాట పట్టారు.
సెంచరీ చేసిన శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ , 14 వికెట్లు తీసిన వరుణ్ కు మ్యాన్ ఆఫ్ ద సీరీస్ దక్కింది.