రసవత్తరంగా మారిన టెస్ట్ మ్యాచ్
సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్..కోహ్లీ
బెంగళూరు – బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. మూడో రోజు భారత్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి సెషన్ లో కీవీస్ బౌలర్ల దెబ్బకు తల వంచిన భారత్ 46 పరుగులకే చాప చుట్టేసింది. కానీ రెండో సెషన్ లో మాత్రం దుమ్ము రేపింది. కీవీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. తొలి ఇన్నింగ్స్ లో సున్నాకే వెనుదిరిగిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో చెలరేగి పోయాడు.
ప్రధానంగా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ముచ్చటైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లకు మింగుడు పడని విధంగా చూడ చక్కనైన షాట్స్ తో అలరించాడు. మరో వైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే ఆట చివరి నిమిషంలో ఉన్నట్టుండి సెంచరీ సాధిస్తాడని అనుకున్న విరాట్ కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు.
ఇక తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించింది కీవీస్ . 402 భారీ స్కోర్ సాధించింది. ఇప్పటికే మూడు కీలక వికెట్లను కూల్చింది. కీవీస్ జట్టులో రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు. తన జట్టులో కీలక పాత్ర పోషించాడు.
ఇక మన జట్టు రెండో ఇన్నింగ్స్ విషయానిక వస్తే కోహ్లీ 102 బంతులు ఆడి 70 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. సర్ఫరాజ్ ఖాన్ 78 బంతులు ఎదుర్కొని 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో 52 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. ఆట ముగిసే సమయానికి ఇండియా 3 వికెట్లు కోల్పోయి 231 రన్స్ చేసింది.