సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ
సత్తా చాటిన యువ క్రికెటర్
బెంగళూరు – బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీ చేసి ఔరా అనిపించేలా చేశాడు.
తను విరాట్ కోహ్లీతో, రోహిత్ శర్మతో కలిసి బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తను జట్టులోకి రావడానికి ఎన్నో తిప్పలు పడ్డాడు. చివరకు అనుకున్నది సాధించాడు. ఏకంగా మెయిడెన్ సెంచరీ చేసి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. తన ప్రాధాన్యత ఏమిటో చెప్పకనే చెప్పాడు ఈ యువ ఆటగాడు.
తను ప్రస్తుతం కడపటి వార్తలు అందేసరికి మైదానంలో రిషబ్ పంత్ తో కలిసి ఆడుతున్నాడు. మొత్తం 119 బంతులు ఎదుర్కొని 106 రన్స్ చేశాడు. ఇందులో 14 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆట విషయానికి వస్తే రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా ఇండియా 46 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో చాప చుట్టేసింది.
ఇక ప్రత్యర్థి కీవీస్ జట్టు 402 పరుగులకు ఆలౌట్ కాగా భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో సూపర్ షో తో ముందుకు సాగుతోంది. ఇవాల్టి వరకు భారీ స్కోర్ చేస్తే ఏమైనా ఆశలు ఉంటాయి. లేదంటే ఓటమి అంచుల్లోకి వెళ్లాల్సి వస్తుంది.