సాంట్నర్ దెబ్బకు భారత్ విల విల
156 పరుగులకే చాప చుట్టేశారు
ముంబై – తొలి టెస్టులో ఘోరమైన పరాజయం పొందినా భారత జట్టు ఆట తీరులో మార్పు రాలేదు. కొత్తగా గౌతం గంభీర్ హెడ్ కోచ్ గా వచ్చినా టెస్టు మ్యాచ్ లో ఇంకా పట్టు ఉండటం లేదు. తాజాగా ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు పోటీ ఇవ్వలేక పోయింది ప్రత్యర్థి జట్టుకు. అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ న్యూజిలాండ్ దుమ్ము రేపుతోంది.
కీవీస్ బౌలర్ సాంట్నర్ స్పిన్ మంత్రజలానికి మనోళ్లు పడి పోయారు. బోల్తా పడ్డారు. వికెట్లను పారేసుకున్నారు. కేవలం 156 పరుగులు మాత్రమే చేసి ఇక చాలనుకుని పెవిలియన్ బాట పట్టారు. ఏకంగా సాంట్నర్ 7 వికెట్లు తీసుకుని విస్తు పోయేలా చేశాడు. అతడి బౌలింగ్ లో ఆడేందుకు మనోళ్లు నానా తంటాలు పడ్డారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది కీవీస్. వాషింగ్టన్ సుందర్ కీలకంగా మారాడు. దాదాపు 190కి పైగానే ఇప్పటి వరకు ఆధిక్యం లభించింది.
ఈ టెస్టు కూడా ఫలితం వచ్చేలా కనిపిస్తోంది. ఇక స్పిన్నర్ సాంట్నర్ విషయానికి వస్తే మనోడు 19.3 ఓవర్లు వేసి 53 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 7 వికెట్లు కూల్చాడు. 16 రన్స్ వద్ద రెండో రోజు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియా కేవలం 140 పరుగులు మాత్రమే జోడించి చాప చుట్టేసింది.
ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ను న్యూజిలాండ్ ప్రారంభించింది. భారీ రన్స్ చేసి ఇండియాపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది ఆ జట్టు.