చక్రం తిప్పిన స్పిన్నర్లు
దుబాయ్ – దుబాయ్ వేదికగా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ముందు ప్రత్యర్థి న్యూజిలాండ్ 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కీవీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్ దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, షమీ తలా ఒక వికెట్ పడగొట్టారు. కీవీస్ టీమ్ లో మిచెల్ 63 రన్స్ చేస్తే బ్రేస్ వెల్ 53 రన్స్ చేశారు.
ఇదిలా ఉండగా 25 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ లో తలపడుతున్నాయి ఇరు జట్లు. గతంలో జరిగిన ఫైనల్ లో కీవీస్ చేతిలో 4 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా గెలుపొంది ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ ఓటమి పాలవకుండా నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక సెమీస్ లో పాకిస్తాన్ లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్ కు చేరుకుంది కీవీస్. ఆ జట్టు ఒక మ్యాచ్ మాత్రమే ఓటమి పాలై టోర్నీలో తాడో పేడో తేల్చుకోనుంది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.