భారత్ వర్సెస్ న్యూజిలాండ్
దుబాయ్ – ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగనుంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ స్టేడియంలో టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ఇరు జట్లు బలంగా ఉండడంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. భారత జట్టు న్యూజిలాండ్ తో పోటీ పడనుంది. ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తీవ్ర నిరాశకు గురి చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ ఒక్క మ్యాచ్ గెలవకుండానే నిష్క్రమించింది. రోహిత్ సేన ఎలాగైనా సరే ట్రోఫీని గెలుచు కోవాలని పట్టుదలతో ఉంది. దేశ వ్యాప్తంగా ఫైనల్ మ్యాచ్ కోసం వేచి చూస్తోంది.
ఇదిలా ఉండగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి దాయాది పాకిస్తాన్ జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. స్టార్ క్రికెటర్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఇదే సమయంలో సెమీస్ లో కూడా సూపర్ షో తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత్ తరపున నిలిచాడు. ఇక భారత జట్టు అత్యంత బలంగా ఉంది. ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే సూపర్ షోతో ఆకట్టుకుంది. ఎవరు గెలుస్తారనే దానిపై భారీ ఎత్తున బెట్టింగ్స్ కూడా కొనసాగుతుండడం విశేషం.