6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై విజయం
దుబాయ్ – ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో భారత జట్టు విక్టరీ నమోదు చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మైదానం నలుమూలలా కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. మొత్తం 111 బంతులు ఎదుర్కొని 100 రన్స్ చేశాడు. తన క్రికెట్ కెరీర్ లో 51వ సెంచరీ నమోదు చేశాడు.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత పాకిస్తాన్ స్కిప్పర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు కట్టడి చేయడంతో పాక్ 241 పరుగులకే పరిమితమైంది. అనంతరం 242 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ గెలుపొందింది. ఉన్న కొద్ది సేపైనా సూపర్ షాట్స్ తో అలరించాడు రోహిత్ శర్మ. తనకు తోడుగా ఉన్న శుభ్ మన్ గిల్ చుక్కలు చూపించాడు. తను 46 రన్స్ వద్ద అవుట్ కాగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సూపర్ షో చేశారు. తను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
తను అవుట్ అయ్యాక మైదానంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా నిరాశ పరిచినా అక్షర్ పటేల్ కోహ్లీకి తోడుగా నిలవడంతో ఇండియా అలవోకగా విజయం సాధించింది. భారత బౌలర్లు పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. గెలుపు సాధించి పెట్టారు. టీమిండియా విక్టరీ నమోదు చేయడంతో దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి.