ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ
6 పరుగుల తేడాతో గెలుపు
అమెరికా – ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అమెరికా లోని న్యూయార్క్ లో జరిగిన కీలక మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దాయాది పాకిస్తాన్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించింది. మరోసారి వరల్డ్ కప్ లో తనకు ఎదురే లేదని చాటి చెప్పింది. ఇప్పటి వరకు టి20 వరల్డ్ కప్ చరిత్రలో 17 సార్లు తల పడ్డాయి ఇరు జట్లు. టీమిండియా ఏకంగా 16 సార్లు గెలిస్తే పాకిస్తాన్ ఒకే ఒక్కసారి విజయం సాధించింది.
మొదటగా వర్షం దోబూచు లాడినా తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత బ్యాటర్లను కట్టడి చేశారు. కేవలం రిషబ్ పంత్ మాత్రమే రాణించాడు. 42 రన్స్ చేశాడు. మిగతా వారంతా చేతులెత్తేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 119 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ , హార్దిక్ పాండ్యా కళ్లు చెదిరే బంతులతో ఆకట్టుకున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ సూపర్ . మొత్తంగా దాయాది పాకిస్తాన్ పై భారత్ గెలుపొందడంతో ప్రపంచ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. జాతీయ పతాకం రెప రెప లాడింది.