రిషబ్ పంత్ సూపర్ షో
భారత్ గెలుపులో కీలక పాత్ర
న్యూయార్క్ – ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన దాయాదుల పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కళ్లప్పగించి చూశారు. ఎవరు గెలుస్తారోనని. ఇక ఐసీసీ అయితే ఏకంగా అమెరికాలోని ప్రధాన నగరాలలో బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేసింది.
మొత్తంగా ఇరు జట్లు క్రికెట్ లోని మజాను మరోసారి ఫ్యాన్స్ కు రుచి చూపించాయి. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది కీలక మ్యాచ్. పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పాకస్తాన్ బౌలర్లు ఆదినుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వారి ధాటికి బ్యాటర్లు నిలవలేక పోయారు. కానీ రిషబ్ పంత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 42 రన్స్ చేసి గౌరవ ప్రదమైన స్కోర్ వచ్చేలా చేశాడు. తను ఒక్కడే 42 రన్స్ చేశాడు.
అంతే కాదు వికెట్ కీపర్ గా పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించాడు. మూడు అద్భుతమైన క్యాచ్ లు పట్టాడు. ఇదే సమయంలో తను కొట్టిన రివర్స్ షాట్ క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునేలా చేసింది.