శాంసన్ సెంచరీ ఇండియా విక్టరీ
రెండు శతకాలు బాదిన ఏకైక క్రికెటర్
దక్షిణాఫ్రికా – మరోసారి కేరళ స్టార్ సంజూ శాంసన్ రెచ్చి పోయాడు. తన సత్తా ఏమిటో రుచి చూపించాడు. ఇండియాలోనే కాదు బయట కూడా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. టి20 సీరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన సీరిస్ లో తొలి టి20 మ్యాచ్ లో దుమ్ము రేపాడు.
బంగ్లాదేశ్ తో హైదరాబాద్ లో జరిగిన టి20 మ్యాచ్ లో సూపర్ సెంచరీతో కదం తొక్కితే ఇవాళ జరిగిన కీలక మ్యాచ్ లో సైతం రెచ్చి పోయాడు. సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపెనర్ గా రావడం బ్యాటింగ్ పరంగా సెట్ కావడం శాంసన్ ఫ్యాన్స్ కే కాదు భారత అభిమానులకు సంతోషం కలిగించింది.
ఇప్పటికే టీమిండియా టెస్ట్ సీరీస్ ను 0-3 తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో సంజూ 50 బంతులు ఆడి 107 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. కింగ్స్ మీడ్ మైదానంలో పరుగుల వరద పారించాడు కేరళ స్టార్.
దీంతో ఇండియా 61 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టి20 ఫార్మాట్ లో 2 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ శాంసన్ కావడం విశేషం. ఇక మ్యాచ్ పరంగా చూస్తే సంజూతో పాటు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ రాణించాడు. ఈ ఇద్దరు తప్పా ఇతర ఆటగాళ్లు ఎవరూ రాణించ లేదు.
సఫారీ బౌలర్లలో కొయెట్టి 3 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీస్తే బిష్ణోయ్ 28 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికాలో క్లాసెన్ ఒక్కడే 25 రన్స్ చేశాడు. ఇతడే ఆ జట్టులో టాప్ స్కోరర్. 17.5 ఓవర్లలో 141 పరుగులకే చాప చుట్టేసింది.