NEWSNATIONAL

ఇండియా నినాదం మోదీపై యుద్ధం

Share it with your family & friends

లేక‌పోతే దేశానికి తీర‌ని న‌ష్టం

న్యూఢిల్లీ – సేవ్ డెమోక్ర‌సీ పేరుతో ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాలు చేప‌ట్టిన భారీ ర్యాలీ బిగ్ స‌క్సెస్ అయ్యింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ రాచ‌రిక ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అన్ని పార్టీల నేత‌లు గ‌ళం విప్పారు. త‌మ‌దైన శైలిలో నిప్పులు చెరిగారు. ఇంకెంత కాలం ఈ దేశంలో విద్వేషాలు రెచ్చ‌గొడ‌తారంటూ ప్ర‌శ్నించారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు మేల్కోవాల‌ని లేక పోతే భార‌త రాజ్యాంగానికి ర‌క్ష‌ణ అనేది లేకుండా పోతుంద‌ని హెచ్చ‌రించారు.

మీ విలువైన ఓటును రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కూట‌మికి మ‌ద్ద‌తుగా వేయాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీ ప‌దే ప‌దే 400 సీట్లు వ‌స్తాయ‌ని చెబుతోంద‌ని, ఏం సాధించింద‌ని ఇన్ని సీట్లు వ‌స్తాయో ప్ర‌ధాని చెప్పాల‌న్నారు . ఈ దేశంలో ప్ర‌శ్నించ‌డం నేరంగా మారింద‌న్నారు. కులం, మ‌తం ఇప్పుడు ఆధిప‌త్యం చెలాయిస్తున్నాయ‌ని ఆరోపించారు ఇండియా కూట‌మి నేత‌లు.

మోదీ తాను మాత్ర‌మే నాయ‌కుడిగా ఉండాల‌ని ఉవ్విళ్లూరుతున్నార‌ని, క‌ల‌లు కంటున్నార‌ని ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. కేవ‌లం ప్ర‌చారం త‌ప్ప ప‌ని చేసింది ఏమీ లేద‌న్నారు. దేశాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త పీఎంది కాదా అని ప్ర‌శ్నించారు .