ప్రజాస్వామ్య పరిక్షరణే ధ్యేయం
కేరళ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వంపై అలుపెరుగని రీతిలో యుద్దం చేస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. కేరళ వేదికగా జరిగిన నిరసనలో ఆయా పార్టీలకు చెందిన సీఎంలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కేరళ సీఎం పినరయ్ విజయన్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు సీపీఐ, సీపీఎం, డీఎంకే, తదితర పార్టీలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రాచరికం కొనసాగుతోందన్నారు. మోదీ ఒక్కరు మాత్రమే ఉండాలని అనుకుంటున్నారని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన చెందారు.
ఎట్టి పరిస్థితుల్లో జనం బీజేపీ సర్కార్ నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేకించి ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అనుకుంటున్నారని కానీ మోదీ ఫెయిల్ కావడం తప్పదన్నారు.
ఈ దేశంలో ఎందరో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి చివరకు అలిసి పోయి , భూమి మీదనే లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను పడగొట్టే నీచ సంస్కృతిని మానుకోవాలని ఇండియా కూటమి సూచించింది.