మోదీ సర్కార్ బేకార్
భగ్గుమన్న భారత కూటమి
న్యూఢిల్లీ – ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి నిప్పులు చెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆదివారం తమ భాగస్యామ్య పక్ష పార్టీ ఆప్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టింది. వేలాదిగా తరలి వచ్చారు. పూర్తిగా జన సంద్రంగా మారి పోయింది దేశ రాజధాని.
ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయా పార్టీల నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాద్ పార్టీలకు చెందిన అధినేతలు కూడా హాజరు కావడం విశేషం.
ఈ సందర్భంగా ఇండియా కూటమి నేతలు మూకుమ్మడిగా యుద్దం ప్రకటించారు. ఈ దేశంలో కేవలం బీజేపీ, మోదీ మాత్రమే ఉండాలని అనుకుంటున్నారని కానీ అది జరగదని హెచ్చరించారు. భారత దేశం ప్రజాస్వామ్య దేశమని ఆ మాత్రం గుర్తు పెట్టుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కావాలని కుట్ర పూరితంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.