ఇండియా కూటమి కీలక భేటీ
జూన్ 4న ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ – భారత కూటమి కీలక సమావేశం శనివారం ఏఐసీసీ చీప్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి కూటమిలో భాగస్వాములైన పార్టీలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ , ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ , బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , డీఎంకే ఎంపీ టీఆర్ బాలు , ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, తదితర కీలక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా జూన్ 4న దేశ వ్యాప్తంగా ఏడు విడతలుగా జరిగిన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇండియా కూటమి తరపున ఆయా పార్టీలకు చెందిన నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని కోరారు.
ఇదిలా ఉండగా మొత్తం 545 స్థానాలకు గాను 543 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఏడు విడతలుగా పోలింగ్ చేపట్టింది. మొత్తంగా బీజేపీ 400 సీట్లకు పైగా వస్తాయని పదే పదే ప్రకటిస్తుండగా ఇండియా కూటమి మాత్రం ఈసారి తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తోంది.