కరుణానిధి ఎల్లప్పటికీ స్పూర్తి
ఆయన దేశానికి ఆదర్శప్రాయుడు
తమిళనాడు – డీఎంకే పార్టీకి చెందిన అరుదైన నాయకుడు, ప్రజా పాలకుడిగా గుర్తింపు పొందిన కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి ఇవాళ. యావత్ తెలంగాణ రాష్ట్రమంతటా అరుదైన నాయకుడిని స్మరించుకుంటోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది డీఎంకే.
ఈసారి ఊహించని రీతిలో భారత దేశంలోని ప్రధాన పార్టీలకు చెందిన అధినేతలంతా తమిళనాడు బాట పట్టారు. వారంతా కరుణానిధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన జీవితాంతం సామాజిక న్యాయం కోసం పోరాడారని కొనియాడారు.
కరుణానిధి అందించిన స్పూర్తి, అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ తమిళనాడులో ప్రజానీకం గుర్తు చేసుకుంటూనే ఉంటారని పేర్కొన్నారు నేతలు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.
ఇండియా కూటమి విజయమే కరుణానిధికి మనం ఇచ్చే అరుదైన నివాళి అని స్పష్టం చేశారు. మోడీ అరాచక ప్రభుత్వానికి చెంప పెట్టు ఈ తీర్పు కావాలని పేర్కొన్నారు సోనియా గాంధీ.