Thursday, April 3, 2025
HomeNEWSNATIONALరూ. 2.43 ల‌క్ష‌ల కోట్ల ఒప్పందం

రూ. 2.43 ల‌క్ష‌ల కోట్ల ఒప్పందం

భార‌త్..ఖ‌తార్ దేశాల మ‌ధ్య డీల్

భార‌త్, ఖ‌తార్ దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వాములుగా ఎదిగేందుకు భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మ‌ధ్య కాలంలో ఇంత పెద్ద డీల్ కుద‌ర‌డం ఇదే మొద‌టిసారి. ఇరు దేశాలు క‌లిసి ఏకంగా రూ. 2.43 ల‌క్ష‌ల కోట్లు అంటే 28 బిలియ‌న్ డాల‌ర్ల‌కు తీసుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ, ఖ‌తార్ పాల‌కుడు షేక్ తమీమ్ బిన్ హ‌మ‌ద్ అల్ థాని మ‌ధ్య ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇరు దేశాలు క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణయించాయి.

ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పరుగులు పెట్టించేందుకు, వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగేందుకు భారత్, ఖతార్‌ నిర్ణయించాయి. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాల‌ని నిర్ణ‌యించాయి.

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఉద్దేశించిన, సవరించిన ద్వంద్వ పన్నుల విధానం రద్దు ఒప్పందాలపై భారత్‌-ఖతార్‌ ప్రతినిధులు సంతకాలు చేశారు. వాటిలో ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం, అర్కైవ్స్‌ నిర్వహణ, యువజన వ్యవహారాలు, క్రీడల్లో సహకారం వంటివి ఉన్నాయి.

ఉగ్రవాదాన్ని ఇరు దేశాల నేతలు ఖండించారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక యంత్రాంగాల ద్వారా ఈ ముప్పును ఎదుర్కొవడానికి పరస్పరం సహకరం అందించుకోవడాని అంగీకరించారు. ఈ మేరకు విడుదల చేసిన జాయింట్ స్టేట్​మెంట్​లో ఇరు దేశాలు తెలిపాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments