Friday, April 4, 2025
HomeNEWSANDHRA PRADESHసంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన మ‌న్మోహ‌న్ సింగ్

సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన మ‌న్మోహ‌న్ సింగ్

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నివాళి

అమ‌రావ‌తి – అరుదైన రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వినయం, వివేకం, చిత్తశుద్ధి మూర్తీభవించిన మేధావి అని కొనియాడారు. ప్ర‌పంచ ఆర్థిక‌వేత్త‌ల‌లో అగ్ర‌గ‌ణ్యుడ‌ని, అంతే కాదు దేశాన్ని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన నాయ‌కుడ‌ని కొనియాడారు . ఇలాంటి నాయ‌కులు అరుదుగా జ‌న్మిస్తార‌ని అన్నారు. ఆయ‌న మృతి దేశానికి , త‌న‌కు తీర‌ని లోటు అని స్ప‌ష్టం చేశారు.

మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. 1991లో ఆర్థిక మంత్రిగా తన ఆర్థిక సంస్కరణల నుండి ప్రధానమంత్రిగా తన నాయకత్వం వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవ చేసి లక్షలాది మందిని ఉద్ధరించారని నాయుడు తెలిపారు.

భారత ఆర్థిక పరివర్తనకు నాయకత్వం వహించిన దూరదృష్టి కలిగిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మృతి చెందడం బాధాకరం అన్నారు. ఇదిలా ఉండ‌గా మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ మృతి ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు.

ఆయ‌న‌ దూరదృష్టితో కూడిన విధానాలు, ఆర్థిక సంస్కరణలు భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి పునాది వేసింద‌న్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments