టీఎంసీ ఎంపీపై నబీలా షాకింగ్ కామెంట్స్
తన వీడియోను మార్ఫింగ్ చేశారని ఆవేదన
బెంగళూరు – ఇండియా టుడే న్యూస్ ఛానల్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ నబీలా జమాల్ సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ సాకేత్ గోఖలే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన వీడియోను ఎడిటింగ్, మార్ఫింగ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్ట్ నబీలా జమాల్. దీనిపై స్పందించారు టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే. ఆమె నిష్పక్షపాతంగా తన పని చేయడం లేదని, కేవలం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఛానల్ ద్వారా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దీనిని ప్రజలు గమనించాలని ఎంపీ కోరారు.
ఆయన ఛానల్ పేరు ప్రస్తావించకుండానే బీజేపీ రిపోర్టర్ గా నబీల్ జమాల్ ను పేర్కొన్నారు. జర్నలిస్టులు ఏ ఒక్క పార్టీకో కాకుండా ప్రజల పక్షాన తమ వాయిస్ వినిపించాలని సూచించారు. అలా కాకుండా మోడీ , అమిత్ షా పరివారం కోసం పని చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
కోల్ కతా విషయంలో పూర్తిగా ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు ఎంపీ . దీనిని పూర్తిగా ఖండించారు నబీలా జమాల్. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.