ఇండియా టుడే సీ ఓటర్ మోషన్ సర్వే
ఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ తర్వాత అత్యంత జనాదరణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు కేంద్ర హోం శాఖ మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా. మోడీ, షా బంధం ఈనాటిది కాదు గత కొన్నేళ్లుగా ఫెవికోల్ కంటే ఎక్కువగా కొనసాగుతూ వస్తుంది.
భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది తలపండిన నాయకులు, మంత్రులు, మేధావులు ఉన్నప్పటికీ అమిత్ షా దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఇదే విషయం ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు పొంది ఇండియా టుడే ఛానల్ తాజాగా సీ ఓటర్ మోషన్ పేరుతో ఎవరు మోడీ తర్వాత పీఎం అయితే బాగుంటుందని సర్వే నిర్వహించారు.
ఈ సందర్బంగా అత్యధిక శాతం మోడీ తర్వాత ప్రధానిగా అమిత్ షా అయితేనే దేశానికి మేలు జరుగుతుందని భావించారు. 25 శాతం షాకు జై కొడితే ఆ తర్వాతి స్థానం బీజేపీలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు పొందిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఛాయిస్ ఇచ్చారు. ఆయనకు కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలకడం గమనార్హం.
ఆ తర్వాతి స్థానాలలో కేంద్ర ఉపరితల , రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీకి 13 శాతం ఓట్లు రాగా , కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , శివ రాజ్ సింగ్ చౌహాన్ కు 5 శాతం తొప్పున ఓట్లు పడడం విస్తు పోయేలా చేసింది.