SPORTS

ఫిబ్ర‌వ‌రి 22న భార‌త్..పాక్ మ్యాచ్

Share it with your family & friends

ఫిబ్ర‌వ‌రిలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ

ముంబై – ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 22న దుబాయ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జ‌రుగుతుంది. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు. ఈసారి ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది పాకిస్తాన్. విదేశాల‌లోనే ఇండియా మ్యాచ్ లు ఆడ‌నుంది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ జ‌ట్టు ఎట్టి ప‌రిస్థితుల్లో పాకిస్తాన్ దేశానికి వెళ్ల‌డం కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ లో లేద‌ని, త‌మ ఆట‌గాళ్లకు ఎవ‌రు భ‌ద్ర‌త క‌ల్పిస్తారంటూ ప్ర‌శ్నించారు.

ఇదే స‌మ‌యంలో బీసీసీఐ పాకిస్తాన్ లో జ‌రిగే వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనేందుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా మోడీ ప్ర‌భుత్వానికి విన్న‌వించింది. భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా తాము అనుమ‌తి ఇవ్వ‌ద‌ల్చు కోలేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది . దీంతో సెక్యూరిటీ కార‌ణంగా వెళ్ల‌డం కుద‌ర‌దంటూ ఐసీసీకి స్ప‌ష్టం చేసింది. దీంతో హైబ్రిడ్ మోడ‌ల్ లో నిర్వ‌హించేందుకు ఒప్పుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *