గౌతమ్ గంభీర్ షాకింగ్ నిర్ణయం
ఆస్ట్రేలియా – భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు కోలుకోలేని షాక్ ఇచ్చారు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఆసిస్ పర్యటనలో ఉన్న టీమిండియా 5వ టెస్టు మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మ పూర్ పర్ ఫార్మెన్స్ కారణంగా తనను విశ్రాంతి తీసుకోమన్నట్లు వెల్లడించారు హెడ్ కోచ్. దీంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా హర్ట్ అయ్యారు. గంభీర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇదిలా ఉండగా 5 టెస్టు మ్యాచ్ ల సీరిస్ లో ఇప్పటికే భారత జట్టు 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ ఆడలేదు. ఈ మ్యాచ్ కు స్టాండింగ్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించారు. ఆ తర్వాత 2, 3, 4 టెస్టు మ్యాచ్ లలో కెప్టెన్ ఆడాడు.
మూడు మ్యాచ్ లకు కలిపి కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. దారుణంగా విఫలమయ్యాడు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్ రూమ్ లో తాను మాట్లాడిన మాటలు ఎలా బయటకు వచ్చాయో అర్థం కాలేదన్నాడు.