ఇరు దేశాల మధ్య సత్ సంబంధాలు
ఫ్రాన్స్ – విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు ప్రధాని మోడీ. ఏఐ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్ కు చేరుకున్నారు. పీఎంకు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పీఎంను కలిసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ మోడీకి సాదర స్వాగతం పలికారు. పీఎంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం, టెక్నాలజీ, వ్యాపార, వాణిజ్య రంగాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు.
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తనకు అత్యంత నమ్మకమైన స్నేహొతుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ అని కొనియాడారు. ధన్యవాదాలు తెలిపారు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన దేశాధినేతలు, ప్రధానులు హాజరయ్యారు. వీరిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా గత నెలలో మిస్టర్ వాన్స్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరు నాయకుల మొదటి సమావేశం ఇది కావడం విశేషం.
చలిని సైతం లెక్క చేయకుండా ప్రవాస భారతీయులు తనకు సాదర స్వాగతం పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారతీయులు ఎక్కడున్నా చల్లంగా ఉండాలని కోరారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.