NEWSNATIONAL

పాకిస్తాన్ లో ‘రా’ ఆప‌రేష‌న్

Share it with your family & friends

గార్డియ‌న్ సంచ‌ల‌న క‌థ‌నం

న్యూఢిల్లీ – ప్ర‌ముఖ ప‌త్రిక గార్డియ‌న్ సంచ‌ల‌న క‌థ‌నం వెలువ‌రించింది. పాకిస్తాన్ లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల చేతుల్లో పేరు పొందిన టెర్ర‌రిస్టులు హ‌తం అవుతూ వ‌స్తున్నారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది తెలియ‌కుండా పోతోంది. త‌ల ప‌ట్టుకుంటోంది పాకిస్తాన్ . ఇప్ప‌టికే ఉగ్ర‌వాదానికి కేరాఫ్ గా మారిన ఆ దేశం ఇండియా పేరు చెబితే వ‌ణికే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇందుకు ప్ర‌ధాన కార‌కుడు ఎవ‌రో కాదు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆరు నూరైనా స‌రే భార‌త భూభాగంలోకి ఎవ‌రు వ‌చ్చినా వారి అంతు చూస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆ దిశ‌గా ఆర్మీని స‌మాయ‌త్తం చేశారు మోదీ.

గ‌త కొంత కాలం నుంచీ వాంటెడ్ టెర్ర‌రిస్టులు ఖ‌తం అవుతూ వ‌స్తుండ‌డంతో జ‌డుసు కుంటున్నారు . ఇందుకు సంబంధించి గార్డియ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఉగ్ర‌వాదుల‌ను అంతం చేసేందుకు మోదీ స‌ర్కార్ పాకిస్తాన్ లో హ‌త్యాకాండ‌లు నిర్వ‌హించిన‌ట్లు బాంబు పేల్చింది. దీనిపై ఇంకా స్పందించ లేదు భార‌త ప్ర‌భుత్వం.